బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:00 AM
పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్(52) బీజేపీలో మంగళవారం చేరారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో...
న్యూఢిల్లీ, మార్చి 31 : పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్(52) బీజేపీలో మంగళవారం చేరారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో పేస్ కాషాయ కండువా వేసుకున్నారు. ప్రధాని మోదీ నాయకత్వం, క్రీడల పట్ల ఆయనకు ఉన్న మక్కువ కారణంగానే తాను బీజేపీలో చేరానని పేస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. బీజేపీలో చేరడమనేది దేశానికి ముఖ్యంగా యువతకు సేవ చేసేందుకు తనకు దక్కిన పెద్ద అవకాశమని పేర్కొన్నారు. బీజేపీలో చేరడాన్ని ఓ బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. రాబోయే 20-25 ఏళ్లల్లో ప్రభుత్వం స్పోర్ట్స్ సైన్స్, మెడిసన్, ఫిజియోథెరపీ, క్రీడా మౌలిక సదుపాయాలపై దృష్టిసారించాలని పేస్ సూచన చేశారు.