‘ఓట్ బచావో-దేశ్ బచావో’
ABN , Publish Date - Oct 18 , 2026 | 05:15 AM
ఓట్ చోరీపై చేపట్టిన పోరును ఉధృతం చేసేందుకు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఓట్ బచావో-దేశ్ బచావో’ ఉద్యమ ప్రచార బాధ్యతలను పర్యవేక్షించేందుకు భారీగా పరిశీలకులను నియమించింది.
పర్యవేక్షణకు పరిశీలకులు
తెలుగు నేతలకు ప్రాధాన్యమిచ్చిన కాంగ్రెస్ హైకమాండ్
న్యూఢిల్లీ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ఓట్ చోరీపై చేపట్టిన పోరును ఉధృతం చేసేందుకు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఓట్ బచావో-దేశ్ బచావో’ ఉద్యమ ప్రచార బాధ్యతలను పర్యవేక్షించేందుకు భారీగా పరిశీలకులను నియమించింది. దేశవ్యాప్తంగా మొత్తం 208 మంది నేతలను పరిశీలకులుగా నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్, యువ నేతలకు ప్రాధాన్యం కల్పించారు. కేంద్ర మాజీ మంత్రులు ఎం.పల్లంరాజు, జేడీ శీలం, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, ఏపీసీసీ మాజీ చీఫ్లు ఎన్.రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, తెలంగాణ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, తోట లక్ష్మీకాంతరావు, అజ్మతుల్లా హుస్సేనీ, బెల్లయ్య నాయక్, హర్కరా వేణుగోపాల్రావు, వెంకటేశ్, రాంభూపాల్రెడ్డి, సంతోష్ కొల్కుండ, జంగా గౌతమ్ తదితర నాయకులకు కాంగ్రెస్ హైకమాండ్ చోటు కల్పించింది.