Share News

టెలిగ్రామ్‌ యాప్‌ సేవలు మళ్లీ అందుబాటులోకి!

ABN , Publish Date - Jun 24 , 2026 | 03:30 AM

టెలిగ్రామ్‌ యాప్‌ సేవలు దేశవ్యాప్తంగా మళ్లీ అందుబాటులోకొచ్చాయి. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ప్రశ్నపత్రాలు టెలిగ్రామ్‌ ద్వారా లీక్‌ ...

టెలిగ్రామ్‌ యాప్‌ సేవలు మళ్లీ అందుబాటులోకి!

న్యూఢిల్లీ, జూన్‌ 23: టెలిగ్రామ్‌ యాప్‌ సేవలు దేశవ్యాప్తంగా మళ్లీ అందుబాటులోకొచ్చాయి. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ప్రశ్నపత్రాలు టెలిగ్రామ్‌ ద్వారా లీక్‌ అవ్వడంతో కేంద్ర సర్కారు యాప్‌ సేవలపై ఈనెల 22 నుంచి వారంపాటు తాత్కాలిక నిషేధం విధించింది. నిషేధ గడువు ముగియడంతో టెలిగ్రామ్‌ తన సేవలను తిరిగి ప్రారంభించింది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ మళ్లీ డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ అందుబాటులోకొచ్చింది. యాపిల్‌ యాప్‌ ప్లేస్టోర్‌లో మాత్రం మంగళవారం సాయంత్రం వరకు అందుబాటులోకి రాలేదు. అయితే ఐఫోన్‌లో ఇప్పటికే యాప్‌ ఉన్న పాత వినియోగదారులు ఈ సేవలను వాడుకుంటున్నారు. అయితే యాప్‌లో మెసేజ్‌-ఎడిటింగ్‌ ఫీచర్‌ను జూన్‌ 30వ తేదీ వరకు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - Jun 24 , 2026 | 03:30 AM