Share News

పాక్‌ సరిహద్దులో తెలంగాణ యువకుడి అరెస్టు!

ABN , Publish Date - Feb 18 , 2026 | 04:51 AM

రాజస్థాన్‌లోని భారత్‌-పాక్‌ సరిహద్దు ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న తెలంగాణకు చెందిన ఓ యువకుడిని...

పాక్‌ సరిహద్దులో తెలంగాణ యువకుడి అరెస్టు!

జైసల్మేర్‌, ఫిబ్రవరి 17: రాజస్థాన్‌లోని భారత్‌-పాక్‌ సరిహద్దు ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న తెలంగాణకు చెందిన ఓ యువకుడిని బీఎస్ఎఫ్ దళాలు మంగళవారం ఉదయం అరెస్టు చేసినట్టు తెలిసింది. అరెస్టయిన వ్యక్తిని తెలంగాణకు చెందిన అష్ఫక్‌ హుస్సేన్‌(38)గా గుర్తించినట్టు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం.. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లోని మైజలార్‌ ప్రాంతంలోని గుంజల్‌ఘడ్‌లో ఆంక్షలు ఉన్న ప్రదేశంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని స్థానికులు పట్టుకుని.. బీఎ్‌సఎ్‌ఫకు సమాచారమిచ్చారు. పట్టుబడిన వ్యక్తి తెలంగాణకు చెందిన అష్ఫక్‌ హుస్సేన్‌గా గుర్తించారు. అష్ఫక్‌ వద్ద భారతీయ పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై బీఎ్‌సఎ్‌ఫతోపాటు నిఘా వర్గాలు దర్యాప్తు చేపట్టాయి.

Updated Date - Feb 18 , 2026 | 04:52 AM