Share News

కురుక్షేత్ర ఎన్‌ఐటీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

ABN , Publish Date - Feb 17 , 2026 | 06:18 AM

హరియాణాలోని కురుక్షేత్ర జిల్లాలోని ఎన్‌ఐటీలో తెలంగాణకు చెందిన విద్యార్థి సోమవారం ఉరి వేసుకుని మృతి చెందాడు.

కురుక్షేత్ర ఎన్‌ఐటీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

కురుక్షేత్ర, ఫిబ్రవరి 16 : హరియాణాలోని కురుక్షేత్ర జిల్లాలోని ఎన్‌ఐటీలో తెలంగాణకు చెందిన విద్యార్థి సోమవారం ఉరి వేసుకుని మృతి చెందాడు. అంగద్‌ శివ(19) అనే ఆ విద్యార్థి తన హాస్టల్‌ రూమ్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరానికి చెందిన ఇతడు ఇంజనీరింగ్‌ సీఎ్‌సఈ మొదటి సెమిస్టర్‌ చదువుతున్నాడు. అతడి ఇద్దరు రూమ్‌మేట్లు మధ్యాహ్న భోజనానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఉదయం తరగతులకు హాజరైన అతడు అనంతరం హాస్టల్‌ రూమ్‌కి చేరుకుని ఉరి వేసుకున్నాడు.

Updated Date - Feb 17 , 2026 | 06:19 AM