ఫలించిన తెలంగాణ పోలీసుల వ్యూహం
ABN , Publish Date - Feb 23 , 2026 | 01:51 AM
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీతోపాటు అతడి సైన్యాన్ని లొంగుబాటు దిశగా తీసుకువచ్చే అంశంలో తెలంగాణ పోలీసులు అనుసరించిన వ్యూహం ఫలించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీతోపాటు అతడి సైన్యాన్ని లొంగుబాటు దిశగా తీసుకువచ్చే అంశంలో తెలంగాణ పోలీసులు అనుసరించిన వ్యూహం ఫలించింది. మావోయిస్ట్ అగ్రనేతలు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో లొంగిపోయేందకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, ఎస్‌ఐబీ చీఫ్ సుమతి అనుసరించిన విధానాలు కేంద్ర హోం శాఖ ప్రశంసలు పొందాయి. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం రోజు సీఎం రేవంత్ రెడ్డి మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపు మావోయిస్టులకు అర్థమయ్యేలా తెలంగాణ పోలీసులు వ్యవహరించారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్‌కౌంటర్లు కొనసాగుతుండగా తెలంగాణ పోలీసులు మాత్రం సంయమనం పాటించారు. లొంగిపోయిన వారికి గుర్తింపు, డబ్బు, జీవనోపాధి కల్పించడం వంటి చర్యలు చేపడుతూ మావోయిస్టులను ఆకట్టుకున్నారు. దాని వల్లే ఒకేసారి ఇంతమంది మావోయిస్టులు లొంగిపోయారు.