Share News

తేజ్‌స యుద్ధ విమానంలో బ్రేక్‌ ఫెయిల్‌?

ABN , Publish Date - Feb 24 , 2026 | 04:13 AM

స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం(ఎల్‌సీఏ) తేజస్‌ వరుస ప్రమాదాలు వాయుసేనను ఆందోళనకు గురిచేస్తోంది.

తేజ్‌స యుద్ధ  విమానంలో బ్రేక్‌ ఫెయిల్‌?

బెంగళూరు, ఫిబ్రవరి 23: స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం(ఎల్‌సీఏ) తేజస్‌ వరుస ప్రమాదాలు వాయుసేనను ఆందోళనకు గురిచేస్తోంది. ఈనెల 7న ఓ ఫ్రంట్‌లైన్‌ ఎయిర్‌బే్‌సలో తేజస్‌ విమానం అదుపుతప్పి రన్‌వేను దాటి ముందుకు వెళ్లిపోయింది. దీనికి ఆ విమానం బ్రేక్‌ ఫెయిల్యూర్‌ కారణమని అనుమానిస్తున్నారు. శిక్షణ ముగించుకుని ఈ బేస్‌కు ఆ విమానం వచ్చిన సమయంలో ప్రమాదం సంభవించింది. ప్రమాదాన్ని ముందే గ్రహించిన పైలట్‌ ఎజెక్ట్‌తో క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన తర్వాత ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సాంకేతిక తనిఖీల కోసం వాయుసేన తేజస్‌ విమానాలన్నింటినీ ఆపేసింది. దాదాపు 30 సింగిల్‌ సీట్‌ తేజస్‌ జెట్లను నిలిపివేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ప్రస్తుత ప్రమాదంలో విమానం కూలినట్టు వచ్చిన వార్తలను హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) తోసిపుచ్చింది.

Updated Date - Feb 24 , 2026 | 04:13 AM