టీసీఎస్ నాసిక్ కేసులో నిదాఖాన్‌కు ముందస్తు బెయిల్ నిరాకరణ
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:09 AM
టీసీఎస్ నాసిక్-బీపీఓ మత మార్పిళ్లు-లైంగిక వేధింపుల కేసులో నిందితురాలు నిదా ఖాన్‌కు తాత్కాలిక బెయిల్ ఇవ్వడానికి నాసిక్...
నాసిక్, ఏప్రిల్ 20: టీసీఎస్ నాసిక్-బీపీఓ మత మార్పిళ్లు-లైంగిక వేధింపుల కేసులో నిందితురాలు నిదా ఖాన్‌కు తాత్కాలిక బెయిల్ ఇవ్వడానికి నాసిక్ అదనపు జిల్లా కోర్టు జడ్జి కేజ జోషి సోమవారం తిరస్కరించారు. ఈ బెయిల్ పిటిషన్‌ను ఈ నెల 27న విచారించనున్నారు. గర్భవతినన్న కారణంతో ముందస్తు బెయిల్ ఇవ్వాలని నిదాఖాన్ కోరారు. మరోవైపు, నాసిక్ టీసీఎస్‌లో మహిళా టెకీల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిళ్లే లక్ష్యంగా తనను మానసిక హింసకు గురిచేశారంటూ తాజాగా మరో మహిళా టెకీ ఫిర్యాదు చేశారు. చీరను పట్టుకుని లాగడం, తొడలు, భుజాలపై పదేపదే చేతులు వేయడం వంటి అసభ్యకర చేష్టలకు తన టీమ్ లీడరు సహా పలువురు పాల్పడ్డారని ఆమె వాపోయారు.