Share News

అవును.. నమాజ్‌ నేర్పించా

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:03 AM

తీవ్ర కలకలం రేపిన నాసిక్‌ టీసీఎస్‌ వ్యవహారంలో కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ సంస్థలోని సిబ్బందికి నిందితులు మత సంబంధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్టు తాజాగా బయటపడింది.

అవును.. నమాజ్‌ నేర్పించా

  • మతంపై సిబ్బందికి క్లాసులు తీసుకున్నా

  • విచారణలో నిదాఖాన్‌ ఒప్పుకోలు

న్యూఢిల్లీ, జూన్‌ 9 : తీవ్ర కలకలం రేపిన నాసిక్‌ టీసీఎస్‌ వ్యవహారంలో కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ సంస్థలోని సిబ్బందికి నిందితులు మత సంబంధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్టు తాజాగా బయటపడింది. ఈ కేసులోని నిందితుల్లో ఒకరైన నిదా ఖాన్‌ పోలీసుల విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. సంస్థలోని సిబ్బందికి తాను నమాజ్‌ చేయడం నేర్పించినట్టు ఆమె అంగీకరించారు. అరెస్టు సమయానికి ఆమె టీసీఎ్‌సలో హెచ్‌ఆర్‌గా పనిచేసేవారు. మతం మారాలని నిదా తనను బలవంతపెట్టారంటూ ఓ బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ విషయాన్ని పోలీసు విచారణలో నిదా కూడా ధ్రువీకరించారు. పోలీసులు డిజిటల్‌ ఆధారాలను ప్రధానంగా చేసుకుని ఆమెను ప్రశ్నించారు. మతపరమైన సమాచారం కలిగిన 171 లింకులను నిదా తోటి సిబ్బందికి పంపించినట్టు గుర్తించినట్టు ఓ ఇంగ్లీష్‌ న్యూస్‌ చానల్‌ కథనం ప్రసారం చేసింది. ఈ కథనాన్ని అనుసరించి.. ఇస్లామ్‌ మత వ్యాప్తికి ప్రయత్నించినట్టు నిదాఖాన్‌ పోలీసుల వద్ద అంగీకరించారు. బాధితురాలిని రోజూ నిదా తన ఇంటికి తీసుకెళ్లి, మత విషయాల్లో క్లాసులు తీసుకునేవారు. వేర్వేరు కారణాలతో బాధితురాలు మానసిక సమస్యలతో బాధపడేవారు. దీనిని ఆసరా చేసుకుని, ఆమెను మతం మార్చేందుకు నిదా ప్రయత్నించారు. టీమ్‌ లీడర్లు డానీశ్‌, తౌసిఫ్‌లు కూడా ఒత్తిడి చేయడంతో వారు చెప్పినట్టే బాధితురాలు నడుచుకున్నారు. అనంతర కాలంలో బాధితురాలి ఇంట్లోనే మత కార్యక్రమాలు, ఇస్లామ్‌ ఆరాధన క్రతువులు కొనసాగాయని ఈ కధనం తెలిపింది.

Updated Date - Jun 10 , 2026 | 04:03 AM