Share News

మీ అహంకారాన్ని మీ ప్రియుడు వేణుగోపాల్‌ దగ్గర చూపండి

ABN , Publish Date - Apr 12 , 2026 | 03:42 AM

తమిళనాడు మహిళా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నుంచి హజీనా సయ్యద్‌ను పార్టీ అధిష్ఠానం తొలగించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు...

మీ అహంకారాన్ని మీ ప్రియుడు వేణుగోపాల్‌ దగ్గర చూపండి

  • భారత మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఆల్కా లాంబాను ఉద్దేశించి హజీనా

  • తనను తమిళనాడు మహిళా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నుంచి తొలగించడంపై ఫైర్‌

చెన్నై, ఏప్రిల్‌ 11: తమిళనాడు మహిళా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నుంచి హజీనా సయ్యద్‌ను పార్టీ అధిష్ఠానం తొలగించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడిన కారణంగా హజీనాను తక్షణమే పదవి నుంచి తప్పిస్తున్నట్లు అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఆల్కా లాంబా శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం తమిళనాడు కాంగ్రెస్‌లో వివాదానికి దారితీసింది. ఆల్కా లాంబా ప్రకటనపై హజీనా ఘాటుగా స్పందించారు. ‘‘మీకేమైనా కామన్‌సెన్స్‌ ఉందా? నేను నిన్నే రాజీనామా చేశాను. మీ అహంకారాన్ని మీ ప్రియుడు కేసీ వేణుగోపాల్‌ దగ్గర చూపించండి’’ అంటూ విమర్శించారు. ఆల్కా లాంబా తనను వేధిస్తున్నారని కూడా ఆమె ఆరోపించారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో హజీనాకు టికెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఆమె మద్దతుదారులు మార్చి 1న చెన్నైలోని పార్టీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. కొందరు పెట్రోల్‌ డబ్బాలు పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ అధిష్ఠానం హజీనాను పదవి నుంచి తొలగించింది. ఈ ఘటనలు కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేశాయి.

Updated Date - Apr 12 , 2026 | 03:42 AM