Share News

చెట్టును వ్యాన్‌ ఢీకొని 8మంది కార్మికులు మృతి

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:17 AM

తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్‌ అదుపు తప్పి రహదారి పక్కనున్న చెట్టును ఢీకొనడంతో 8మంది కార్మికులు దుర్మరణం చెందారు.

చెట్టును వ్యాన్‌ ఢీకొని 8మంది కార్మికులు మృతి

  • తమిళనాడులోని తిరుచ్చి వద్ద ఘటన

చెన్నై, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్‌ అదుపు తప్పి రహదారి పక్కనున్న చెట్టును ఢీకొనడంతో 8మంది కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తంజావూరు జిల్లా తిరుకాట్టుపల్లి సమీపంలోని ఇటుకల బట్టీలో పనిచేస్తున్న 10మంది కార్మికులు ఆదివారం ఉదయం తమతోపాటు పనిచేసే మరో కార్మికుడు సురేశ్‌ ఇంటి వేడుకల్లో పాల్గొనేందుకు నామక్కల్‌ జిల్లా ఎరుమైపట్టికి ప్రైవేటు వ్యాన్‌లో వెళ్లారు. ఆ వేడుకలు పూర్తయ్యాక అందరూ ఆదివారం మధ్యాహ్నం తిరుగుముఖం పట్టారు. వారు ప్రయాణిస్తున్న వ్యాన్‌ తిరుచ్చి సమీపం ముసిరి వద్ద అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న వేపచెట్టును ఢీకొంది. ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి విజయ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.

Updated Date - Nov 23 , 2026 | 03:19 AM