Chief Minister M.K. Stalin: తమిళనాడు ఆధ్వర్యంలో జాతీయ సాహిత్య పురస్కారాలు
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:58 AM
తమిళనాడు ప్రభుత్వం ‘సెమ్మొళి సాహిత్య అవార్డు’ (శాస్త్రీయ భాషా సాహిత్య పురస్కారం) పేరుతో ప్రతియేటా జాతీయ స్థాయీ అవార్డులను ప్రదానం చేయనుందని...
సీఎం స్టాలిన్ ప్రకటన
చెన్నై, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు ప్రభుత్వం ‘సెమ్మొళి సాహిత్య అవార్డు’ (శాస్త్రీయ భాషా సాహిత్య పురస్కారం) పేరుతో ప్రతియేటా జాతీయ స్థాయీ అవార్డులను ప్రదానం చేయనుందని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ప్రకటించారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, ఒరియా, బెంగాలీ, మరాఠీ భాషలలో వెలువడే అత్యుత్తమమైన రచనలకు ఈ అవార్డులను ఇవ్వనున్నామని తెలిపారు. ఈ జాబితాలో హిందీ లేకపోవడం గమనార్హం. ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ఖరారు చేసి ప్రకటించనున్న సమయంలో కేంద్ర సాంస్కృతిక శాఖ జోక్యం కారణంగా అవార్డుల ప్రకటన రద్దు చేశారని, ఈ నేపథ్యంలో సాహిత్య అకాడమీ అవార్డులకు దీటుగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతియేటా ఏడు ప్రాంతీయ భాషలకు సంబంధించిన అత్యుత్తమ రచనలకు ‘సెమ్మొళి సాహిత్య అవార్డును అందజేస్తామని తెలిపారు.