Share News

తమిళనాడులో 97.37 లక్షల ఓటర్ల తొలగింపు

ABN , Publish Date - Feb 24 , 2026 | 04:23 AM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్ల తుది జాబితాను సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి అర్చనా పట్నాయక్‌ విడుదల చేశారు.

తమిళనాడులో 97.37 లక్షల ఓటర్ల తొలగింపు

చెన్నై, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్ల తుది జాబితాను సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి అర్చనా పట్నాయక్‌ విడుదల చేశారు. జాబితాలోని వివరాల ప్రకారం.. సర్‌(ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) తర్వాత చేర్పులు, మార్పులు పోగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారణాలతో 97.37 లక్షలమంది ఓటర్లను తొలగించినట్లు ఆమె తెలిపారు. సర్‌ ప్రక్రియకు ముందు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 6.41 కోట్లుగా ఉండేదని చెప్పారు. డిసెంబరు 19నాటికి ఆ సంఖ్య 5,43,76,756కు తగ్గిందని, ఆ తర్వాత 27.53 లక్షల మంది అర్హులైన ఓటర్ల పేర్లను చేర్చామని వివరించారు.

Updated Date - Feb 24 , 2026 | 04:23 AM