Share News

పొరబాటున ప్రొఫెసర్‌ నిర్బంధం

ABN , Publish Date - Oct 30 , 2026 | 03:14 AM

తమిళనాడుకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, ప్రొఫెసర్‌ కలైయరసన్‌ను పోలీసులు పొరపాటున నిర్బంధించి ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు.

పొరబాటున ప్రొఫెసర్‌ నిర్బంధం

  • తర్వాత క్షమాపణలు చెప్పిన తమిళ పోలీసులు

చెన్నై, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తమిళనాడుకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, ప్రొఫెసర్‌ కలైయరసన్‌ను పోలీసులు పొరపాటున నిర్బంధించి ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. కలైయరసన్‌ చెన్నై డెవల్‌పమెంట్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అయితే, బుధవారం వేకువజామున పమ్మల్‌ డీ4 శంకర్‌నగర్‌ పోలీసుస్టేషన్‌కు చెందిన పోలీసులు మఫ్టీలో కలైయరసన్‌ నివాసానికి వెళ్లి పల్లావరం టీవీకే ఎమ్మెల్యే జె.కామాక్షిని ఇన్‌స్టాగ్రామ్‌లో దూషించారంటూ ఆయనను అరెస్టు చేశారు. తనకు ఇన్‌స్టా ఖాతా లేదని ప్రొఫెసర్‌ చెప్పినా పోలీసులు వినిపించుకోకుండా ఓ వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆ తరువాత ఎవరెవరికో ఫోన్‌ చేసిన పోలీసులు.. ప్రొఫెసర్‌ ఫొటోతో వేరెవరో ఫేక్‌ ఖాతా సృష్టించారని గుర్తించారు. దీంతో తాము పొరపాటున అరెస్టు చేశామంటూ కలైయరసన్‌ను 3 గంటలు తర్వాత ఆయన ఇంటి వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయారు. దీనిపై కలైయరసన్‌ డీజీపీకి గురువారం ఫిర్యాదు చేశారు. కాగా గురువారం సాయంత్రం సీఎం విజయ్‌ నుంచి పిలుపు రావటంతో ప్రొఫెసర్‌ కలైయరసన్‌ సచివాలయానికి వెళ్లి ఆయన్ని కలిశారు. జరిగిన ఘటన పట్ల సీఎం విచారం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Updated Date - Oct 30 , 2026 | 03:17 AM