Share News

తమిళనాడులో మహిళల రక్షణకు ‘సింగపెణ్‌’

ABN , Publish Date - Jun 10 , 2026 | 03:59 AM

మహిళల రక్షణ కోసం తమిళనాట ‘సింగపెణ్‌’(ఆడ సింహం) పేరుతో ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ...

తమిళనాడులో మహిళల రక్షణకు ‘సింగపెణ్‌’

చెన్నై, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): మహిళల రక్షణ కోసం తమిళనాట ‘సింగపెణ్‌’(ఆడ సింహం) పేరుతో ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సీఎం విజయ్‌ ఈ విభాగాన్ని మంగళవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో మహిళలను వేధించేవారిని, కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించే వారిని, లైంగిక వేధింపులకు పాల్పడే వారిని గుర్తించేందుకు వీలుగా దేశంలోనే తొలిసారి డ్రోన్‌ పెట్రోలింగ్‌ వ్యవస్థను ప్రవేశపెట్టామన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 03:59 AM