Share News

లంచ్‌ బాక్స్‌తో పావు గంట ముందే సచివాలయానికి సీఎం విజయ్‌

ABN , Publish Date - May 16 , 2026 | 04:02 AM

తమిళనాడు సీఎం విజయ్‌.. ప్రభుత్వ ఉద్యోగిలా రోజూ సచివాలయానికి విధులకు హాజరవుతుండటంపై ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా...

లంచ్‌ బాక్స్‌తో పావు గంట ముందే సచివాలయానికి సీఎం విజయ్‌

  • అధికారులతో సమీక్షలతో బిజీ

చెన్నై, మే15(ఆంధ్రజ్యోతి): తమిళనాడు సీఎం విజయ్‌.. ప్రభుత్వ ఉద్యోగిలా రోజూ సచివాలయానికి విధులకు హాజరవుతుండటంపై ఉన్నతాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆయన సమయపాలన పాటిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగిలా నిర్దేశిత సమయానికి పావుగంట ముందే సచివాలయానికి వస్తున్నారు. ఇంటి నుంచి లంచ్‌ బాక్స్‌ తెచ్చుకుంటున్నారు. భోజన విరామ సమయంలో తన చాంబర్‌లోనే మధ్యా హ్నం భోజనం ముగించి, మళ్లీ విధులకు హాజరవుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే దిశగా, ఎన్నికల హామీలను అమలు చేయడానికి ఆర్థిక వనరులు సమకూర్చుకునే విషయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దీనిలో భాగంగా కీలక ఫైళ్లను పరిశీలిస్తూ.. ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ బిజీగా ఉంటున్నారు.

Updated Date - May 16 , 2026 | 04:02 AM