తమిళనాడులో ‘మేనమామ ఉంగరం’ పథకం
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:05 AM
ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నెరవేరుస్తూ తమిళనాడు సీఎం విజయ్ చిన్నారులకు బంగారు కానుక ఇచ్చారు.
చెన్నై, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నెరవేరుస్తూ తమిళనాడు సీఎం విజయ్ చిన్నారులకు బంగారు కానుక ఇచ్చారు. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం తమిళనాట ప్రభుత్వాస్పత్రులు, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జన్మించిన శిశువుల కోసం ‘మేనమామ బంగారు ఉంగరం’ పథకాన్ని ప్రారంభించింది. సోమవారం మదురైలోని రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువులను తన చేతుల్లోకి తీసుకుని బంగారు ఉంగరాలు తొడిగిన సీఎం విజయ్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆస్పత్రి ఆడిటోరియంలో 25మంది శిశువులకు స్వయంగా ఉంగరాలు తొడిగి ఆశీర్వదించిన విజయ్.. అనంతరం ప్రసూతి విభాగానికి వెళ్లి మరో 10 మంది శిశువులకు ఉంగరాలు బహూకరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
రోడ్డు తనిఖీలో చెంపదెబ్బ వివాదం! ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మపై కేసు నమోదు
ఎల్‌పీయూలో భయానక రాత్రి.. ఆ రోజు ఏం జరిగింది..?