Share News

35కు చేరిన విజయ్‌ మంత్రివర్గం

ABN , Publish Date - May 23 , 2026 | 05:29 AM

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ మంత్రివర్గంలో సభ్యుల సంఖ్య 35కు చేరింది. విజయ్‌ ప్రభుత్వంలో చేరేందుకు వీసీకే, ఐయూఎంఎల్‌ ...

35కు చేరిన విజయ్‌ మంత్రివర్గం

చెన్నై, మే 22 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ మంత్రివర్గంలో సభ్యుల సంఖ్య 35కు చేరింది. విజయ్‌ ప్రభుత్వంలో చేరేందుకు వీసీకే, ఐయూఎంఎల్‌ సుముఖత వ్యక్తం చేయడంతో ఆయా పార్టీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వన్నియరసు (దిండివనం), షాజమాన్‌ (పాపనాశం) శుక్రవారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ ఆర్వీ అర్లేకర్‌ వారి చేత ప్రమాణం చేయించారు. ఇప్పటికే విజయ్‌ మంత్రివర్గంలో 33 మంది మంత్రులుండగా, ఈ ఇద్దరి చేరికతో ఆ సంఖ్య 35కు చేరినట్లయింది.

Updated Date - May 23 , 2026 | 05:30 AM