తమిళనాడులో రైతులకు రూ.50 వేల రుణమాఫీ
ABN , Publish Date - May 26 , 2026 | 04:16 AM
సహకార బ్యాంకుల నుంచి 2025 మే 1నుంచి 2026 ఫిబ్రవరి 28 మధ్య రూ.50వేల వరకు పంటరుణాలు పొందిన సన్నకారు రైతులకు తమిళనాడు...
చెన్నై, మే 25 (ఆంధ్రజ్యోతి): సహకార బ్యాంకుల నుంచి 2025 మే 1నుంచి 2026 ఫిబ్రవరి 28 మధ్య రూ.50వేల వరకు పంటరుణాలు పొందిన సన్నకారు రైతులకు తమిళనాడు సీఎం విజయ్ శుభవార్త అందించారు. ఆ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.50 వేలకు మించి రుణం తీసుకున్న వారికి స్థాయిల వారీగా కొంతమేర మొత్తం రుణాన్ని మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో కొత్త చిత్రం విడుదలైన రోజు నుంచి 7రోజుల వరకు ప్రతిరోజూ 5 షోలకు అనుమతి ఇస్తూ విజయ్ ఉత్తర్వులు జారీచేశారు.