తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవు
ABN , Publish Date - Nov 27 , 2026 | 03:10 AM
తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు.
ముఖ్యమంత్రి విజయ్ ప్రకటన
చెన్నై, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త నిబంధనల మేరకు వివాహితులైన పురుష ప్రభుత్వ ఉద్యోగులు శిశువు జన్మించిన ఆరు నెలల్లోపు ఎప్పుడైనా ఈ 15 రోజుల సెలవును వినియోగించుకోవచ్చు. తమిళనాడులో ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు 365 రోజులు ప్రసూతి సెలవులు పొందే అవకాశం ఉంది.