Share News

ప్లాట్‌ఫామ్‌ ఫీజును రూ.2.59 పెంచిన స్విగ్గీ

ABN , Publish Date - Mar 25 , 2026 | 03:31 AM

స్విగ్గీ సంస్థ తన ప్లాట్‌ఫామ్‌ ఫీజును పెంచింది. ఒక్కో ఆర్డర్‌పై రూ.17.58 వసూలు చేస్తోంది. ఇప్పటివరకు ఇది రూ.14.99గా ఉంది.

ప్లాట్‌ఫామ్‌ ఫీజును రూ.2.59 పెంచిన స్విగ్గీ

న్యూఢిల్లీ, మార్చి 24: స్విగ్గీ సంస్థ తన ప్లాట్‌ఫామ్‌ ఫీజును పెంచింది. ఒక్కో ఆర్డర్‌పై రూ.17.58 వసూలు చేస్తోంది. ఇప్పటివరకు ఇది రూ.14.99గా ఉంది. తాజాగా ఈ ఫీజును రూ.2.59(17 శాతం) పెంచింది. నిర్వహణ ఖర్చులు పెరగడం, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడం కోసమే ఈ ఫీజును పెంచినట్లు స్విగ్గీ తెలిపింది. కాగా, జొమాటో కూడా ఇటీవలే ప్లాట్‌ఫామ్‌ ఫీజును రూ.2.40 పెంచింది. ప్రస్తుతం జొమాటో ప్లాట్‌ఫామ్‌ ఫీజు రూపంలో వినియోగదారుల నుంచి రూ.14.90 వసూలు చేస్తోంది.

Updated Date - Mar 25 , 2026 | 03:31 AM