Share News

స్విగ్గీ డెలివరీ బాయ్‌ సంపాదన.. రూ.53 లక్షలు

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:39 AM

ఏటా రూ. ఆరు లక్షలకు పైనే.. ఎనిమిదేళ్లలో ఏకంగా రూ.53 లక్షల సంపాదన. స్విగ్గీ డెలివరీ బాయ్‌ పడిన కష్టానికి దక్కిన ప్రతిఫలమిది. చిన్న ఉద్యోగమే అయినా.. నచ్చిన వేళల్లో స్వేచ్ఛగా పనిచేస్తూ, నిరంతర కృషితో తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను చక్కగా మార్చుకున్న ఓ సామాన్యుడి కథనం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది.

స్విగ్గీ డెలివరీ బాయ్‌   సంపాదన.. రూ.53 లక్షలు
swiggy delivery

  • స్విగ్గీ డెలివరీ బాయ్‌

  • సంపాదన.. రూ.53 లక్షలు

  • ఎనిమిదేళ్ల కష్టానికి దక్కిన ప్రతిఫలం

  • చెన్నైకి చెందిన ఓ వ్యక్తి విజయగాథ

చెన్నై, సెప్టెంబర్‌ 20: ఏటా రూ. ఆరు లక్షలకు పైనే.. ఎనిమిదేళ్లలో ఏకంగా రూ.53 లక్షల సంపాదన. స్విగ్గీ డెలివరీ బాయ్‌ పడిన కష్టానికి దక్కిన ప్రతిఫలమిది. చిన్న ఉద్యోగమే అయినా.. నచ్చిన వేళల్లో స్వేచ్ఛగా పనిచేస్తూ, నిరంతర కృషితో తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను చక్కగా మార్చుకున్న ఓ సామాన్యుడి కథనం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. పిల్లలను మంచిగా చదివించుకోవాలన్నదే శంకర్‌ దంపతుల ప్రధాన లక్ష్యం. దీంతో ‘స్విగ్గీ’ డెలివరీ బాయ్‌గా వచ్చిన అవకాశాన్ని శంకర్‌ సద్వినియోగం చేసుకున్నాడు. ఇంత మేరే సంపాదించాలని కాకుండా.. ‘కష్టే ఫలి’ మంత్రాన్ని నమ్ముకుని సాగిపోయాడు. స్విగ్గితో తన ప్రయా ణం మొదలైనప్పుడు.. ఈ ప్లాట్‌ఫామ్‌ తన జీవితా న్ని ఇంతలా మారుస్తుందని కలలో కూడా ఊహించలేదని శంకర్‌ పేర్కొన్నాడు. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, తనకు వీలైన సమయంలో పనిచేస్తూ.. తనకు తానే బాస్‌లా వ్యవహరిస్తూ ఇంతమేర సంపాదించానని అతడు పేర్కొనడం గమనార్హం. ఇప్పుడు తన పిల్లలను బాగా చదివించుకుంటున్నానని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయని అతడు వెల్లడించాడు. స్విగ్గీ డెలివరీ బాయ్‌ల విజయవంతమైన గాథలను తోటి ఉద్యోగులకు స్ఫూర్తినిచ్చేలా సంస్థ తన అంతర్గత వేదికల్లో పంచుకుంటూ ఉంటుంది. శంకర్‌ విజయగాథ అలా బయటకు వచ్చింది. నిత్యం రోడ్లపై వాహన రద్దీ, కాలుష్యం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య ఒక వ్యక్తి తన ‘డెలివరీ’ ప్రయాణాన్ని.. అది కూడా ఎనిమిదేళ్లుగా ఒకే సంస్థతో కొనసాగిస్తుండడం సాధారణ విషయం కాదు. కష్టపడి పనిచేసే తత్వం, పట్టుదల ఉంటే ఏ పని అయినా.. ఏ రంగంలో అయినా రాణించొచ్చని శంకర్‌ కథనం నిరూపిస్తోంది.

Updated Date - Sep 21 , 2026 | 05:39 AM