Share News

మేం కఠిన చర్యలు తీసుకొనేలోపే చొరబాటుదారులంతా పారిపోండి

ABN , Publish Date - May 27 , 2026 | 04:03 AM

తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొనేలోపే రాష్ట్రం విడిచి పారిపోవాలని చొరబాటుదారులను సీఎం సువేందు అధికారి తీవ్రంగా హెచ్చరించారు.

మేం కఠిన చర్యలు తీసుకొనేలోపే చొరబాటుదారులంతా పారిపోండి

  • బెంగాల్‌ సీఎం సువేందు తీవ్ర హెచ్చరిక

కోల్‌కతా, మే 26: తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొనేలోపే రాష్ట్రం విడిచి పారిపోవాలని చొరబాటుదారులను సీఎం సువేందు అధికారి తీవ్రంగా హెచ్చరించారు. భారత్‌ నుంచి తమ పౌరులను తిరిగి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని, వారిని తీసుకెళ్లడం ఆ దేశ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. చొరబాటుదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని జైలుకు పంపవద్దని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు. ‘‘అసలు మనం వారికి ఆశ్రయం ఎందుకివ్వాలి? వారికోసం మన దేశ వనరులను ఎందుకు వృథా చేసుకోవాలి? ఈ చొరబాటుదారులేమైనా మన అల్లుళ్లా?’ అని సువేందు ప్రశ్నించారు. ‘‘గుర్తించండి, తొలగించండి, బహిష్కరించండి’’ నినాదంతో రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీ పౌరులను వెనక్కి పంపడానికి బెంగాల్‌ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

Updated Date - May 27 , 2026 | 04:03 AM