Share News

8 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేత?

ABN , Publish Date - Mar 17 , 2026 | 03:44 AM

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తొలి అంకంలో సస్పెండైన 8మంది విపక్ష ఎంపీలపై మంగళవారం సస్పెన్షన్‌ ఎత్తి వేస అవకాశం ఉంది. సభ కార్యకలాపాలకు అడ్డుతగిలినందుకు ఏడుగురు కాంగ్రెస్‌....

8 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేత?

  • విపక్ష నేతలతో సమావేశం తర్వాత నిర్ణయం

న్యూఢిల్లీ, మార్చి 16: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తొలి అంకంలో సస్పెండైన 8మంది విపక్ష ఎంపీలపై మంగళవారం సస్పెన్షన్‌ ఎత్తి వేస అవకాశం ఉంది. సభ కార్యకలాపాలకు అడ్డుతగిలినందుకు ఏడుగురు కాంగ్రెస్‌, ఒక సీపీఎం ఎంపీని స్పీకర్‌ ఓం బిర్లా నాడు సస్పెండ్‌ చేశారు. దీంతో వారి సస్పెన్షన్‌ ఎత్తివేయాలని విపక్షాలు ఆందోళన నిర్వహించినా స్పీకర్‌ అంగీకరించలేదు. అయితే ఓం బిర్లాపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయాక అధికార, విపక్ష నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. సభలో హుందాగా ప్రవర్తించాలని, టేబుళ్లు ఎక్కరాదని, పేపర్లు చింపి వెల్‌లోకి విసరవద్దని, ఏఐ ద్వారా రూపొందించిన ఫొటోలు, పోస్టర్లు తీసుకురావద్దని సూచించారు. విపక్ష నేతలు సానుకూలంగా స్పందించడంతో ఆయన 8మంది ఎంపీలపై ఉన్న సస్పెన్షన్‌ ఎత్తివేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. వాస్తవానికి ఈ సస్పెన్షన్‌ ఏప్రిల్‌ 2 వరకు ఉంది.

Updated Date - Mar 17 , 2026 | 03:44 AM