Share News

ఎస్‌ఐఆర్‌లో ఆటంకాలను అనుమతించం

ABN , Publish Date - Feb 10 , 2026 | 03:26 AM

ఓటర్ల జాబితా సవరణ(ఎ్‌సఐఆర్‌) ప్రక్రియలో అడ్డంకులు సృష్టించడానికి ఎవరినీ అనుమతించబోమని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ దీనిని దృష్టిలో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఎస్‌ఐఆర్‌లో ఆటంకాలను అనుమతించం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఓటర్ల జాబితా సవరణ(ఎ్‌సఐఆర్‌) ప్రక్రియలో అడ్డంకులు సృష్టించడానికి ఎవరినీ అనుమతించబోమని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ దీనిని దృష్టిలో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని కోరింది. ఆ రాష్ట్రంలో ‘సర్‌’ దరఖాస్తుల పరిశీలన, తుది వివరాల తయారీకి గడువును న్యాయస్థానం వారం రోజులు పొడిగించింది. ఎస్‌ఐఆర్‌లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో తాము జారీ చేసిన కొన్ని నోటీసులను కొందరు దుండగులు కాల్చి వేశారని ఎన్నికల సంఘం లేవనెత్తిన అంశంపై ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. బెంగాల్‌లో జరుగుతున్న ఎస్‌ఐఆర్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ రాష్ట్ర సీఎం మమత సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.

Updated Date - Feb 10 , 2026 | 03:26 AM