Share News

వాంగ్‌చుక్‌ నిర్బంధాన్ని సమీక్షించండి: సుప్రీం

ABN , Publish Date - Feb 05 , 2026 | 03:38 AM

ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, వీలైతే ఆయన నిర్బంధాన్ని సమీక్షించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది.

వాంగ్‌చుక్‌ నిర్బంధాన్ని సమీక్షించండి: సుప్రీం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, వీలైతే ఆయన నిర్బంధాన్ని సమీక్షించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. వాంగ్‌చుక్‌ అరెస్టును సవాలు చేస్తూ ఆయన భార్య గీతాంజలి జె. ఆంగ్మో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. వాంగ్‌చుక్‌ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఆయనకు వయసు సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయని తెలిపింది. ఆయన నిర్బంధంపై పునఃసమీక్షించాలని సొలిసిటర్‌ జనరల్‌ కె.ఎం. నటరాజ్‌కు మౌఖికంగా సూచించింది.

Updated Date - Feb 05 , 2026 | 03:38 AM