‘కోర్టు ధిక్కరణ’పై నేడు సుప్రీం ప్రత్యేక విచారణ
ABN , Publish Date - Oct 11 , 2026 | 05:27 AM
ఢిల్లీలో శనివారం సీజేపీ నిరసన కార్యక్రమం సందర్భంగా మెట్రో రైలు స్టేషన్లను మూసివేయటం, రైళ్లను రద్దుచేయటంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది.
న్యూఢిల్లీ, అక్టోబరు 10: ఢిల్లీలో శనివారం సీజేపీ నిరసన కార్యక్రమం సందర్భంగా మెట్రో రైలు స్టేషన్లను మూసివేయటం, రైళ్లను రద్దుచేయటంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. నిరసనల పేరుతో సామాన్య ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగేలా రైలు రవాణా వ్యవస్థను స్తంభింపజేయరాదని పోలీసులను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ నిరసనలన అడ్డుకొనేందుకు పోలీసులు మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఢిల్లీకి రావాల్సిన పలు రైళ్లను రద్దుచేశారు. దీనిపై శైలేంద్ర మణి త్రిపాఠి అనే న్యాయవాది శనివారమే కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఆదివారం సెలవుదినం అయినప్పటికీ ఈ పిటిషన్‌పై ప్రత్యేకంగా విచారణ జరపాలని నిర్ణయించింది.