హైవేలపై గోశాలలు నిర్మించండి
ABN , Publish Date - Jan 30 , 2026 | 03:22 AM
జాతీయ రహదారులపై తిరుగుతున్న వీధి పశువుల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు సుప్రీం కోర్టు ఓ వినూత్న ప్రతిపాదన చేసింది.
ఢిల్లీ, జనవరి 29: జాతీయ రహదారులపై తిరుగుతున్న వీధి పశువుల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు సుప్రీం కోర్టు ఓ వినూత్న ప్రతిపాదన చేసింది. హైవేల నిర్మాణ బాధ్యతలు చూసే సంస్థలే తమ సామాజిక బాధ్యత కిందప్రతి 50కిలోమీటర్లుకు ఒక గోశాలను ఏర్పాటుచేసి, వాటిని సంరక్షించాలని ఎన్‌హెచ్‌ఏఐని ఆదేశించింది. జనసమ్మర్ద ప్రాంతాల నుంచి వీధికుక్కలను తరలించాలని గతేడాది సుప్రీం ఇచ్చిన తీర్పును సవరించాలని కోరుతూ పలు రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం గురువారం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. హైవేలపై సంచరించే పశువుల సమాచారాన్ని ప్రజలు వెంటనే రిపోర్ట్ చేసేలా ఓ యాప్‌ను రూపొందించాలని ధర్మాసనం ఎన్‌హెచ్‌ఏఐకి సూచించింది.