కంపెనీ లా ట్రైబ్యునళ్లను హైజాక్ చేస్తున్నారు
ABN , Publish Date - Oct 30 , 2026 | 02:12 AM
నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునళ్లను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి త్వ శాఖ అపహరించిందంటూ (హైజాక్) సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
వాటి అధ్యక్షులకు స్వయంప్రతిపత్తి ఇవ్వరేం?
ఈ అంశాన్ని ఎంతకాలం పెండింగ్‌లో పెడతారు?
కార్పొరేట్ వ్యవహారాల శాఖపై సుప్రీం సీరియస్
న్యూఢిల్లీ, అక్టోబరు 29: నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునళ్లను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి త్వ శాఖ అపహరించిందంటూ (హైజాక్) సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సిబ్బంది నియామ కాల విషయంలో ఎన్‌సీఎల్‌టీ (నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్), ఎన్‌సీఎల్‌ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్) అధ్యక్షులకు పూర్తి అధికారాలు ఉండాలని అభిప్రాయపడింది. నియామక పరీక్షల నిర్వహణ కోసం యూపీఎస్‌సీ లేక ఎస్‌ఎస్‌సీ సహాయం తీసుకోవచ్చునని సూచించింది. ‘‘కాంట్రాక్టు ఉద్యోగుల పోకడలు మాకు తెలుసు. న్యాయ/ సాంకేతిక సభ్యులను వారు లక్ష్యపెట్టరు. ట్రైబ్యునళ్ల అధ్యక్షులకు స్వయంప్రతిపత్తి కల్పించడమే దీనికి పరిష్కారం. అయితే, కార్పొరేట్ వ్యవహారాల శాఖ దీనిపై నిర్ణయం తీసుకోదు. సుదీర్ఘకాలంగా ఈ అంశాన్ని పెండింగ్‌లో ఉంచేసింది. ట్రైబ్యునళ్లపై పూర్తి ఆధిక్యతను అది కోరుతుండటంతో, సమస్యలు తలెత్తుతున్నాయి’’ అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఎన్‌సీఎల్‌టీ , ఎన్‌సీఎల్‌ఏటీల్లో కాంట్రాక్టు ప్రాతిపదికగా పనిచేస్తున్న ఉద్యోగులు వేసిన పిటిషన్‌పై సీజేఐ నేతృత్వంలోని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా వాదనలు వినిపించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రాత్రికి రాత్రే తొలగించకుండా, తగిన ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. నవంబరు 1,2 తేదీల్లో ఉద్యోగాలు వదిలిపెట్టి పోవాలని, స్వతంత్ర ప్రైవేటు కంపెనీతో కొత్త నియామకాలు చేపడతా మని ఆ శాఖ చెప్పడం సరికాదన్నారు. నిబంధనలు, పత్రికలకు ఇచ్చిన ప్రకటనల ప్రకారం, తాత్కాలిక సిబ్బందిని క్రమబద్ధీకరించే వెసులుబాటు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునళ్లకు ఉందని వాదించారు. అయితే, కాంట్రాక్టు ఉద్యోగుల విధానాన్ని తాను ఆమోదించబోనని సీజేఐ వ్యాఖ్యానించారు.
బొంబా యిలో జరిగిన ఓ ఘటనలో కాంట్రాక్టు ఉద్యోగులు తమపై నమోదుచేసిన కేసు రిపోర్టు అసలు ప్రతిని, ఎఫ్‌ఐఆర్‌ని తీసుకుని పారిపోయారన్నారు. ట్రైబ్యున ళ్లలోని న్యాయ సభ్యులను కాంట్రాక్టు ఉద్యోగులు ఇబ్బందులకు గురి చేస్తుంటారని, కొన్ని విషయాల్లో సాంకేతిక సభ్యులు కూడా అతిక్రమణలకు పాల్పడుతుంటారన్నారు. ‘‘కాంట్రాక్టు ఉద్యోగులను పోనీయండి. సదరు కంపెనీ రద్దు కానీయండి. ట్రైబ్యునళ్ల అధ్యక్షులకు పూర్తి అధికారాలను కల్పించడానికి తక్షణం చర్యలు చేపట్టాలి’’ అని సీజేఐ స్పష్టం చేశారు.