Share News

ఉన్నావ్‌ రేప్‌ కేసు నిందితుడికి సుప్రీం షాక్‌

ABN , Publish Date - May 16 , 2026 | 03:50 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2017 నాటి ఉన్నావ్‌ రేప్‌ కేసులో నిందితుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌కు సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది.

ఉన్నావ్‌ రేప్‌ కేసు నిందితుడికి సుప్రీం షాక్‌

  • మాజీ ఎమ్మెల్యే సెంగార్‌ జీవిత ఖైదు నిలిపివేత ఉత్తర్వులు రద్దు

  • మరోసారి విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టుకు ఆదేశం

న్యూఢిల్లీ, మే 15: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2017 నాటి ఉన్నావ్‌ రేప్‌ కేసులో నిందితుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌కు సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. ఆయనకు విధించిన జీవిత ఖైదును నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై మరోసారి విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది. ఈ కేసులో సెంగార్‌కు ట్రయల్‌ కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. తనను దోషిగా తేల్చడంతో పాటు యావజ్జీవ శిక్ష విధించడంపై సెంగార్‌ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌ను రెండు నెలల్లోగా పరిష్కరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీల ధర్మాసనం సూచించింది. హైకోర్టు ఈ కేసును కొత్తగా విచారించి, బాధితురాలితో సహా అందరి వాదనలు వినవచ్చని స్పష్టం చేసింది.

Updated Date - May 16 , 2026 | 03:50 AM