Share News

పని మనుషులకు చట్టబద్ధత కల్పించలేం: సుప్రీం

ABN , Publish Date - Jan 30 , 2026 | 03:21 AM

పని మనుషులకు కనీస భత్యం కల్పించేలా సమగ్ర చట్టం తీసుకు రావాలంటూ దాఖలైన పిల్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది.

పని మనుషులకు చట్టబద్ధత కల్పించలేం: సుప్రీం

న్యూఢిల్లీ, జనవరి 29: పని మనుషులకు కనీస భత్యం కల్పించేలా సమగ్ర చట్టం తీసుకు రావాలంటూ దాఖలైన పిల్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనికోసం ప్రస్తుతం ఉన్న చట్టంలో మార్పులు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించలేమని స్పష్టం చేసింది. ట్రేడ్‌ యూనియన్ల గురించి ఈ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధి కుంటుపడటానికి ట్రేడ్‌ యూనియన్ల ధోరణే ప్రధాన కారణమన్నారు. ‘‘ఎన్నో సంప్రదాయక పరిశ్రమలు ఈ ‘జెండా’ యూనియన్ల వల్లనే ఖాయలా పడ్డాయి. వాళ్లకు పని చేయాలని ఉండదు. వారి కారణంగానే దేశాభివృద్ధి నిలిచిపోయింది. ఈ రంగంలో దోపిడీ లేదని కాదు. కానీ, దానితో వ్యవహరించే దారులు కూడా ఉన్నాయి’’ అని అభిప్రాయపడ్డారు. లక్షల్లో ఉన్న పని మనుషుల దుస్థితిని సుప్రీంకోర్టు గుర్తించింది. అయితే, వారికి చట్టబద్ధత కల్పించేలా శాసన వ్యవహారాల్లో జోక్యం కలగజేసుకోలేమని స్పష్టం చేసింది.

Updated Date - Jan 30 , 2026 | 03:21 AM