ప్రైవేటు బడుల్లో విద్యాహక్కు చట్టం అమలుపై ఇంత నిర్లక్ష్యమా..?
ABN , Publish Date - Sep 30 , 2026 | 04:31 AM
విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో బలహీన వర్గాల పిల్లలకు 25ు రిజర్వేషన్ అమలు విషయంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్‌సీపీసీఆర్) ఉదాసీనతపై సుప్రీంకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎన్సీపీసీఆర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో బలహీన వర్గాల పిల్లలకు 25ు రిజర్వేషన్ అమలు విషయంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్‌సీపీసీఆర్) ఉదాసీనతపై సుప్రీంకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు విద్యా సంస్థలో ఈ రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉండగా నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించింది. ఎన్‌సీపీసీఆర్ చైర్‌పర్సన్, డైరెక్టర్ ఈ అంశంపై జరిపే తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 2009 విద్యా హక్కు చట్టం సెక్షన్ 12(1)(సి) ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థలు ప్రాథమిక విద్యలో బలహీన వర్గాల బాలలకు 25శాతం సీట్లు కేటాయించి ఉచిత విద్య అందించాలి.