Share News

అనిల్‌ అంబానీ కంపెనీల అక్రమాల విచారణలో జాప్యంపై సుప్రీం ఫైర్‌

ABN , Publish Date - Feb 05 , 2026 | 03:42 AM

అనిల్‌ అంబానీ గ్రూప్‌(అడాగ్‌) కంపెనీలకు సంబంధించిన రూ.40,000 కోట్ల బ్యాంకింగ్‌, కార్పొరేట్‌ అక్రమాలపై సీబీఐ...

అనిల్‌ అంబానీ కంపెనీల అక్రమాల విచారణలో జాప్యంపై సుప్రీం ఫైర్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: అనిల్‌ అంబానీ గ్రూప్‌(అడాగ్‌) కంపెనీలకు సంబంధించిన రూ.40,000 కోట్ల బ్యాంకింగ్‌, కార్పొరేట్‌ అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణలో తీవ్ర జాప్యం నెలకొనడంపై సుప్రీంకోర్టు బుధవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ అక్రమాలపై వేగంగా సరైన విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో దర్యాప్తు నివేదికలను సమర్పించాలని సీబీఐ, ఈడీలను కోరింది. సిట్‌ను ఏర్పాటు చేసి ఈ కేసు దర్యాప్తును సజావుగా పూర్తిచేయాలని ఈడీని ఆదేశించింది. కాగా అనిల్‌ అంబానీ దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందని శర్మ అనుమానం వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు అనుమతి లేకుండా ఆయన దేశం విడిచి వెళ్లరని ఆయన తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గి తెలిపారు.

Updated Date - Feb 05 , 2026 | 03:42 AM