చీటింగ్ కేసుల్లో బాధితులకే పెద్దపీట
ABN , Publish Date - May 22 , 2026 | 03:38 AM
ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు న్యాయం అందించడమే కోర్టుల ప్రథమ కర్తవ్యం కావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అన్నీ కలిపి విచారించాలనడం సరికాదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, మే 21: ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు న్యాయం అందించడమే కోర్టుల ప్రథమ కర్తవ్యం కావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రూ.49 కోట్ల మేర మదుపరులను మోసం చేసిన వ్యవహారంలో ఏపీ సహా ఏడు రాష్ట్రాల పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ లన్నింటినీ కలిపి దర్యాప్తు జరిపేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై గురువారం కోర్టు విచారణ జరిపింది. ఈ తరహా నేరాల్లో బాధిత కేంద్రక విధానం అవసరమంటూ, ఆ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ తిరస్కరించింది. నిందితుల సౌలభ్యం కోసం వారివల్ల మోసపోయి, ఎక్కడెక్కడో ఉన్న బాధితులందరినీ ఒక్కచోటకు చేర్చాలని అడగడం సరైన న్యాయ విధానమేనా? అంటూ నిలదీసింది. సీజేఐ నేతృత్వంలోని ఈ బెంచ్‌లో జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్.ఎమ్.పంచౌలీ సభ్యులుగా ఉన్నారు.