మోసపూరిత మతమార్పిడిలను అరికట్టాలి
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:04 AM
మోసపూరిత మతమార్పిడిలను అరికట్టేలా మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. నాసిక్‌లోని టీఎసీఎస్‌లో ఓ ఉద్యోగి మహిళలను లైంగికంగా వేధించి...
సుప్రీంకోర్టులో వ్యాజ్యం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: మోసపూరిత మతమార్పిడిలను అరికట్టేలా మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. నాసిక్‌లోని టీఎసీఎస్‌లో ఓ ఉద్యోగి మహిళలను లైంగికంగా వేధించి, మతమార్పిడికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది. మత స్వేచ్ఛ అంటే మత మార్పిడికి స్వేచ్ఛ ఉన్నట్టుకాదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. మోసపూరిత మతమార్పిడిలు దేశ సార్వభౌమ అధికారం, భద్రతకు ముప్పు కలిగిస్తాయన్నారు. కాగా ముస్లిం పర్సనల్ లా-షరియత్ అమలు చట్టం-1937లోని కొన్ని నిబంధనలు మహిళలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ మరో వ్యాజ్యం దాఖలైం ది. పౌలోమీ పవనీ శుక్లా, న్యాయ నారీ ఫౌండేషన్ ప్రతినిధులు దీన్ని దాఖలు చేశారు. ఆస్తిలో పురుషులకు పూర్తి హక్కు, మహిళలకు సగం హక్కు ఉండడాన్ని సవాలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తిజస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖకు నోటీసులు పంపింది.