గంగా తీరం వెంట ఆక్రమణలపై నివేదిక ఇవ్వండి.
ABN , Publish Date - Mar 16 , 2026 | 03:37 AM
గంగా నది ఒడ్డున, వరద మైదానాల్లోని అక్రమ నిర్మాణాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని.. ఆక్రమణల తొలగింపునకు తీసుకున్న చర్యలను తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
న్యూఢిల్లీ, మార్చి 15: గంగా నది ఒడ్డున, వరద మైదానాల్లోని అక్రమ నిర్మాణాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని.. ఆక్రమణల తొలగింపునకు తీసుకున్న చర్యలను తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే గంగా నదీ పునరుజ్జీవం, రక్షణ, నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ అమలుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరించాలని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు కేంద్రంతో పాటు గంగా పరీవాహక ప్రాంతాల రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. గంగా నది తీరం వెంట శాశ్వత అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కొట్టేస్తూ ఉత్తర్వులివ్వడంతో.. వాటిని సవాల్ చేస్తూ పట్నావాసి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సమస్యకు వ్యక్తిగత కేసులకు మించి విస్తృత పరిశీలన అవసరమని పేర్కొంది.