Share News

తొలగించిన ఓటర్ల పేర్లు నోటీసు బోర్డుల్లో పెట్టండి

ABN , Publish Date - Jan 30 , 2026 | 03:24 AM

ప్రస్తుతం నడుస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) విషయమై సుప్రీంకోర్టు గురువారం ఎన్నికల సంఘానికి కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.

తొలగించిన ఓటర్ల పేర్లు నోటీసు బోర్డుల్లో పెట్టండి

న్యూఢిల్లీ, జనవరి 29: ప్రస్తుతం నడుస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) విషయమై సుప్రీంకోర్టు గురువారం ఎన్నికల సంఘానికి కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ‘తార్కిక వైరుద్ధ్యం’ అన్న కారణంతో జాబితాను తొలగించిన ఓటర్ల పేర్లను నోటీసు బోర్డుల్లో పెట్టాలని సూచించింది. ‘సర్‌’ రెండో దశలో భాగంగా ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ జరుగుతున్న 9రాష్ట్రాలు, 3కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇది వర్తిస్తుంది. తమిళనాడులో ‘తార్కిక వైరుద్ధ్యం’ కారణంతో జాబితా నుంచి తొలగింపునకు గురైన వ్యక్తులు తమ పేర్లను చేర్చుకునేందుకు తగిన అవకాశం, సమయం ఇవ్వాలని కోరుతూ డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. తండ్రులు, తాతల వయస్సుల మధ్య భారీగా తేడాలు, ఒకరికి ఆరుగురు కంటే ఎక్కువ సంతానం ఉంటే ఈసీ తార్కిక వైరుధ్యాలుగా పేర్కొంది.

Updated Date - Jan 30 , 2026 | 03:24 AM