Share News

భారీగా ఖర్చు పెట్టినా.. కాలుష్యం పోదేం?

ABN , Publish Date - Nov 17 , 2026 | 03:47 AM

యమునా నది కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నదిని శుభ్రం చేసేందుకు భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేసినప్పటికీ.. కాలుష్యం పెరిగిందే తప్ప తగ్గలేదని పేర్కొంది.

భారీగా ఖర్చు పెట్టినా.. కాలుష్యం పోదేం?

  • యమునా నదిలో కాలుష్యం పెరుగుదలపై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, నవంబరు 16: యమునా నది కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నదిని శుభ్రం చేసేందుకు భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేసినప్పటికీ.. కాలుష్యం పెరిగిందే తప్ప తగ్గలేదని పేర్కొంది. ఈ క్రమంలో నది, దాని ప్రధాన కాలువలు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జిల్లాల్లోకి ప్రవేశించే (ఎంట్రీ), బయటకు వచ్చే (ఎగ్జిట్‌ పాయింట్‌) చోట్ల నీటి నాణత్య పరీక్షలు చేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)ని ఆదేశించింది. నదిని శుభ్రపరిచేందుకు కేవలం మురుగునీటి శుద్ధి పాంట్లను నిర్మించడం సరిపోదని, పారిశ్రామిక కాలుష్య కారకాలు, శుద్ధి చేయని మురుగునీటిని వాటి మూలం వద్దనే అరికట్టాలని, వీలైతే పూర్తిగా నిరోధించాలని పేర్కొంది. ఏదైనా రాష్ట్రం, యూటీ, జిల్లా గుండా ప్రవహించేటప్పుడు.. నదీ జలాల నాణ్యత క్షీణిస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, జరిమానాలు విధిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను జనవరి 13కు వాయిదా వేసింది.

Updated Date - Nov 17 , 2026 | 03:48 AM