కస్టడీలో విచారణ జరపాలని కోర్టులు చెప్పలేవు
ABN , Publish Date - Oct 23 , 2026 | 03:45 AM
నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించాలంటూ కోర్టులు ఎలాంటి సూచనలు ఇవ్వలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 22: నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించాలంటూ కోర్టులు ఎలాంటి సూచనలు ఇవ్వలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అది దర్యాప్తు సంస్థల ఇష్టంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఒకవేళ కస్టడీలోకి తీసుకోవాలనుకుంటే దర్యాప్తు సంస్థలు అందుకు కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అంతేతప్ప కస్టడీలోకి తీసుకోవాలని కోర్టులే ఆదేశించలేవని తెలిపింది. గుజరాత్‌కు చెందిన ఓ ప్రిన్సిపాల్ జనన ధ్రువపత్రంలో పుట్టిన సంవత్సరాన్ని ఫోర్జరీ ద్వారా మార్పు చేసి, సర్వీసును ఏడాది పాటు పొడిగించుకున్నారు. దీనిపై ఆయనతో పాటు, భార్య, సహకరించిన మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. అందర్నీ కస్టడీలోకి తీసుకొని విచారణ జరపాలని గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. దీనిని సవాలు చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయుంచగా, కోర్టులు అలాంటి ఆదేశాలు ఇవ్వలేవని స్పష్టం చేసింది.