Share News

ఎమ్మెస్పీపై పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు

ABN , Publish Date - Apr 14 , 2026 | 04:18 AM

కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) నిర్ణయం విషయంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది.

ఎమ్మెస్పీపై పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13: కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) నిర్ణయం విషయంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. ఎమ్మెస్పీ నిర్ణయించే సమయంలో సాగుకు అయ్యే వాస్తవ వ్యయంపై రాష్ట్రాల ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ దాఖలైన ఆ పిటిషన్‌పై స్పందన తెలపాలని కేంద్రాన్ని, ఇతరులను అత్యున్నత న్యాయస్థానం కోరింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపిస్తూ.. పెట్టిన ఖర్చుకు తగ్గట్లు తాము పండించిన ఉత్పత్తులు అమ్ముకోలేక రైతులు ఆర్థికంగా నానా కష్టాలు పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఒక్క మహారాష్ట్రలోనే గడిచిన ఐదేళ్లలో 17 వేల మంది బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పారు. రైతు చేసిన వాస్తవ ఖర్చు కంటే చాలా సార్లు ఎమ్మెస్పీని తక్కువగా నిర్ణయిస్తున్నారని కోర్టుకు విన్నవించారు. కాగా, ధరల నిర్ణయంపై ఎంఎస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ నివేదికను ప్రభుత్వం ఎన్నడూ పట్టించుకోలేదని పిటిషన్‌లో ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 04:18 AM