Share News

పోక్సో కేసులో బీఆర్‌ఎస్‌ నేతకు సుప్రీం నోటీసులు

ABN , Publish Date - May 26 , 2026 | 05:01 AM

ఓ మైనర్‌ బాలుడిపై లైంగిక దాడికి సంబంధించిన పోక్సో కేసులో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌తోపాటు, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

పోక్సో కేసులో బీఆర్‌ఎస్‌ నేతకు సుప్రీం నోటీసులు

  • వివరణ ఇవ్వాలని సర్కారుకు ఆదేశం

న్యూఢిల్లీ, మే 25 (ఆంధ్రజ్యోతి): ఓ మైనర్‌ బాలుడిపై లైంగిక దాడికి సంబంధించిన పోక్సో కేసులో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌తోపాటు, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. 2024 నవంబరులో గద్వాల జిల్లా అలంపూర్‌లోని 3వ వార్డుకు చెందిన కౌన్సిలర్‌, బీఆర్‌ఎస్‌ నేత ఆసిఫ్‌ఖాన్‌ పట్టణానికి చెందిన ఓ మైనర్‌ బాలుడికి ఫోన్‌చేసి స్థానిక గాంధీ విగ్ర హం వద్దకు రావాలని చెప్పాడు. అక్కడికి వచ్చిన బాలుడిపై ఆసి్‌ఫఖాన్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే, ఆసిఫ్ ఖాన్‌ సదరు బాలుడితో మాట్లాడిన ఆడియో రికార్డింగ్‌ను.. ఇంతియాజ్‌ అలీ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. ఈ నేపథ్యంలో బాలుడితోపాటు ఇంతియాజ్‌ అలీపై ఆసిఫ్ ఖాన్‌ రూ.60లక్షలకు పరువునష్టం దావా వేశారు. తనపై పరువునష్టం కేసు నమోదైన విషయం నోటీసులు వచ్చేంత వరకు ఆ బాలుడికి తెలియదు. కోర్టు నోటీసులు వచ్చాక.. బాలుడు పోలీసులను కలిసి తనపై జరిగిన ఘాతుకాన్ని వివరించాడు. అతడి ఫిర్యాదు మేరకు ఆసిఫ్ ఖాన్‌పై అలంపూర్‌ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం ఆసిఫ్ ఖాన్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆసిఫ్ ఖాన్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. దీనిపై గత నెల 21న బాలుడు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశాడు. ఆ పిటిషన్‌ సోమవారం ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పరిశీలించిన ధర్మాసనం ప్రతివాదులుగా ఉన్న ఆసిఫ్‌ ఖాన్‌తోపాటు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేసింది.

Updated Date - May 26 , 2026 | 05:01 AM