Share News

రౌత్‌, వాగ్లేలకు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు

ABN , Publish Date - Oct 17 , 2026 | 06:26 AM

భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్‌తో పాటు మొత్తం న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని బహిరంగ వ్యాఖ్యలు చేసిన శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌, జర్నలిస్ట్‌ నిఖిల్‌ వాగ్లేలకు సుప్రీంకోర్టు క్రిమినల్‌ ధిక్కార చర్యల కింద షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

రౌత్‌, వాగ్లేలకు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు
SUPREMECOURT

న్యూఢిల్లీ, అక్టోబరు 16: భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్‌తో పాటు మొత్తం న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని బహిరంగ వ్యాఖ్యలు చేసిన శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌, జర్నలిస్ట్‌ నిఖిల్‌ వాగ్లేలకు సుప్రీంకోర్టు క్రిమినల్‌ ధిక్కార చర్యల కింద షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ముందుగా వారి వివరణలు పరిశీలిస్తామని పేర్కొన్న జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ బాగ్చిల ధర్మాసనం.. వ్యక్తిగత హాజరు నుంచి వారికి మినహాయింపు కల్పించింది. న్యాయ స్థానాలు ప్రజల హక్కులను కాపాడటంలో ఎప్పుడూ వెనకబడలేదని.. అయినప్పటికీ కోర్టులపై నిరంతర విమర్శలు దురదృష్టకరమని ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు.

Updated Date - Oct 17 , 2026 | 06:26 AM