Share News

ఇస్లాంలోకి మారితే బీసీ కోటా వర్తించదు

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:45 AM

మతం మారితే అంతకుమునుపు ఉన్న కులం, దానికి సంబంధించిన సామాజిక స్థితి కోల్పోయినట్లే అని సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. ఇప్పుడు మరోసారి ఇదే తీర్పును పునరుద్ఘాటించింది.

ఇస్లాంలోకి మారితే బీసీ కోటా వర్తించదు

  • పూర్వపు సామాజిక స్థితి బదిలీ కాదు

  • సుప్రీంకోర్టు పునరుద్ఘాటన

  • ఎస్సీ హోదాపైనా స్పష్టీకరణ

  • తమిళనాడు నోటిఫికేషన్‌ను రద్దుచేస్తూ మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు సమర్థన

న్యూఢిల్లీ, అక్టోబరు 15: మతం మారితే అంతకుమునుపు ఉన్న కులం, దానికి సంబంధించిన సామాజిక స్థితి కోల్పోయినట్లే అని సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. ఇప్పుడు మరోసారి ఇదే తీర్పును పునరుద్ఘాటించింది. గ తంలో క్రైస్తవం స్వీకరించిన వారికి ఎస్సీ హోదా పోతుందని తెలిపిన సుప్రీంకోర్టు.. తాజాగా, ఇస్లాం స్వీకరించిన ఒకవ్యక్తికి బీసీ హోదా ఉండబోదని తెలిపింది. హిందూయిజం, బుద్ధిజం, సిక్కిజం నుంచి ఇతర మతాల్లోకి మారినవారికి.. పూర్వ సామాజిక వ్యవస్థలో వారు అనుభవించిన రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఈ మేరకు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ శ్రీచంద్రశేఖర్‌లధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఇస్లాంలోకి మారిన ఓ బీసీ వ్యక్తికి.. బీసీ రిజర్వేషన్‌ కొనసాగిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దుచేస్తూ మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అందులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అదే సమయంలో హిందూయిజం, బుద్ధిజం, సిక్కిజం మినహా ఇతర మతాలను అవలంబించే వారిని ఎస్సీలుగా పరిగణించడానికి వీలుకాదని తేల్చిచెప్పింది. ‘ఇస్లాం, క్రైస్తవం సహా మరే హిందూయేతర మతంలోకి మారినవారు.. ఇదివరకు హిందూ సామాజిక వ్యవస్థలో ఉన్నప్పుడు తాము అనుభవించిన రిజర్వేషన్లను కోరడానికి వీల్లేదు. వారికి రాజ్యాంగంలోని 16(4) అధికరణ కింద ఎలాంటి చట్టబద్ధ ప్రయోజనాలు, రక్షణ, రిజర్వేషన్‌, ఏ ఇతర లబ్ధీ దక్కవు. హిందూయిజం, బుద్ధిజం, సిక్కిజం నుంచి ఇస్లాంలోకి ఎవరైనా మారితే.. తన పూర్వపు కులానికి సంక్రమించిన ఎస్సీ హోదాను కోల్పోతారు.


మతం మారితే బీసీ (ముస్లిం) రిజర్వేషన్‌ కోరడానికి వీల్లేదు. ఇస్లాంలోకి మారగానే.. తమిళనాడులో నోటిఫై చేసిన ఏడు వెనుకబడిన కులాల్లో సభ్యుడు కానేరడు’ అని విశదీకరించింది. సమీర్‌ అహ్మద్‌ అనే వ్యక్తి 2015లో హిందూయిజం నుంచి ఇస్లాంలోకి మారాడు. ఈ మతమార్పిడిపై 2016లో గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇస్లాం సంప్రదాయాల ప్రకారం అతడు వివా హం కూడా చేసుకున్నాడు. తర్వాత రిజర్వేషన్‌ ప్రయోజనాల కోసం తనకు ‘ముస్లిం లెబ్బాయ్‌’ కులానికి చెందినవాడిగా సర్టిఫికెట్‌ ఇవ్వాలని ప్ర భుత్వాన్ని కోరాడు. రాష్ట్రప్రభుత్వం 2024 మార్చి 9న అతడికి అనుకూలంగా ఆదేశాలిచ్చింది. బీసీలు, మరింత వెనుకబడినవర్గాలు, డీనోటిఫైడ్‌ కులాలు, ఎస్సీ కులాల నుంచి ఇస్లాంలోకి మారిన వారికి బీసీ (ముస్లిం) కేటగిరీ కింద రి జర్వేషన్‌ ఇచ్చే అధికారం తనకు ఉందని వాదించింది. అయితే మద్రాస్‌ హైకోర్టు ఈ వాదనను తోసిప్చుచంది. ఈ ఏడాది జూన్‌లో ఆ నోటిఫికేషన్‌ను రద్దుచేసింది. దీనిపై తమిళనాడు ప్రభు త్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వాదనలు ముగియడంతో కోర్టు ఆగస్టు 7న తన తీర్పును రిజర్వుచేసింది. గురువారం తన నిర్ణయాన్ని వెల్లడించింది. కాగా, సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని, కాంగ్రెస్‌, ఇతర విపక్షాల బుజ్జగింపు రాజకీయాలకు భారీ ఎదురుదెబ్బ అని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా పేర్కొన్నారు.

Updated Date - Oct 16 , 2026 | 05:47 AM