హేమంత్ సొరేన్‌కు సుప్రీంకోర్టులో ఊరట
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:04 AM
ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌కు బుధవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసుపై...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌కు బుధవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసుపై విచారణను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. తనపై ఈడీ పెట్టిన కేసును కొట్టివేయాలని, ప్రతిసారీ సమన్లు జారీ చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. స్టే మంజూరు చేయడంతో పాటు, వివరణ ఇవ్వాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. భూమి కుంభకోణంలో నగదు అక్రమ చలామణికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టులో ఈడీ కేసు పెట్టింది. ఆ కేసును కొట్టివేయాలని సొరేన్ మొదట ట్రయల్ కోర్టు, తర్వాత హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.