Share News

ముఖ్యమంత్రే ఇలా చేస్తే ఎలా?

ABN , Publish Date - Mar 19 , 2026 | 06:27 AM

కోల్‌కతాలో ఐప్యాక్‌ కార్యాలయంలో ఈడీ సోదాలను బెంగాల్‌ సీఎం మమత అడ్డుకోవటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.

ముఖ్యమంత్రే ఇలా చేస్తే ఎలా?

  • బెంగాల్‌లో ఈడీ సోదాలను మమత అడ్డుకోవటంపై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, మార్చి18: కోల్‌కతాలో ఐప్యాక్‌ కార్యాలయంలో ఈడీ సోదాలను బెంగాల్‌ సీఎం మమత అడ్డుకోవటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. అనుమతి లేకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ పరిధిలో ఉన్న ఒక కార్యాలయంలోకి ప్రవేశించి ఆ సంస్థ విధులకు ఆటంకం కలిగించటం సరికాదని పేర్కొంది. ఐప్యాక్‌ కార్యాలయం, ఆ సంస్థ అధిపతి ప్రతీక్‌ జైన్‌ ఇంట్లో ఈడీ జనవరి 8న సోదాలు నిర్వహించింది. ఈ సమయంలో మమత ప్రతీక్‌ జైన్‌ ఇంటికి, ఐప్యాక్‌ ఆఫీ్‌సకు వెళ్లి పలు పత్రాలను తీసుకెళ్లారు. తర్వాత ఈడీ అధికారులపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఇలా కేసు నమోదు చేసే అధికారం రాష్ట్ర పోలీసులకు లేదంటూ ఈడీ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసింది.

Updated Date - Mar 19 , 2026 | 06:27 AM