Share News

న్యాయ రంగంలో 50 శాతం కోటాపై ‘పిల్‌’ కొట్టివేత

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:32 AM

న్యాయ సేవలతో పాటు ప్రభుత్వ ప్యానెళ్లలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని...

న్యాయ రంగంలో 50 శాతం కోటాపై ‘పిల్‌’ కొట్టివేత

  • ఇబ్బంది పెట్టకండి.. మార్పు ఒక్క రోజులో రాదు: సీజేఐ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): న్యాయ సేవలతో పాటు ప్రభుత్వ ప్యానెళ్లలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్‌) విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలాంటి విధానపరమైన అంశాల్లో న్యాయపరంగా జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ‘న్యాయ రంగంలో మహిళల ప్రాతినిధ్యం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. మార్పు అనేది ఒక్క రోజులో రాదు. ఇటువంటి అంశాన్ని న్యాయపరంగా చేపట్టడం సమంజసం కాదు. ఇలాంటి పిటిషన్లతో మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మీరు సమస్యలు కొనితెచ్చుకోకండి’ అని చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్లకు సూచించింది.

Updated Date - Apr 17 , 2026 | 03:32 AM