Supreme Court: పిఎఫ్ వేతన పరిమితి సవరణను పరిశీలించండి
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:16 AM
పదకొండేళ్లుగా సవరించని ఉద్యోగుల భవిష్య నిధి పథకం(ఈపిఎఫ్‌వో) వేతన పరిమితిని సవరించే అంశంపై 4నెలల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు సోమవారం కేంద్రాన్ని ఆదేశించింది..
4 నెలల్లోగా నిర్ణయం తీసుకోండి..కేంద్రానికి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ, జనవరి 5: పదకొండేళ్లుగా సవరించని ఉద్యోగుల భవిష్య నిధి పథకం(ఈపీఎ్‌ఫవో) వేతన పరిమితిని సవరించే అంశంపై 4నెలల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు సోమవారం కేంద్రాన్ని ఆదేశించింది. ఈపీఎ్‌ఫవో ప్రస్తుతం నెలకు రూ.15వేలకన్నా ఎక్కువ జీతం ఉన్న వారిని కవరేజ్ నుంచి మినహాయించిందని పేర్కొంటూ నవీన్ ప్రకాష్ నౌతియాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన కనీస వేతనం.. నెలకు రూ.15వేలుగా ఉన్న ఈపీఎ్‌ఫవో పరిమితి కన్నా ఎక్కువగా ఉందని పిటిషనర్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.