Share News

ఓటరు గుర్తింపు ధ్రువీకరణకు 10వ తరగతి అడ్మిట్‌ కార్డు, పాస్‌ సర్టిఫికెట్‌

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:02 AM

పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) ప్రక్రియలో గుర్తింపు ధ్రువీకరణ కోసం అనుబంధ డాక్యుమెంట్లుగా 10వ ....

ఓటరు గుర్తింపు ధ్రువీకరణకు 10వ తరగతి అడ్మిట్‌ కార్డు, పాస్‌ సర్టిఫికెట్‌

  • పశ్చిమ బెంగాల్‌లో ‘సర్‌’పై సుప్రీంకోర్టు స్పష్టత

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌) ప్రక్రియలో గుర్తింపు ధ్రువీకరణ కోసం అనుబంధ డాక్యుమెంట్లుగా 10వ తరగతి అడ్మిట్‌ కార్డుతో పాటు పాస్‌ సర్టిఫికెట్‌ను సమర్పించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ విపుల్‌ ఎం.పంచోలీతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 10వ తరగతి అడ్మిట్‌ కార్డును స్వతంత్ర గుర్తింపు పత్రంగా అనుమతిస్తారా అంటూ సీనియర్‌ న్యాయవాది డీఆర్‌ నాయుడు ఆందోళన వ్యక్తం చేయడంపై ధర్మాసనం స్పందించింది. అడ్మిట్‌ కార్డు కేవలం అనుబంధ పత్రం మాత్రమేనని తెలిపింది.

Updated Date - Feb 26 , 2026 | 02:02 AM