Share News

నిర్భయ ఘటన తర్వాత వ్యవస్థ ఏం మారింది?

ABN , Publish Date - Sep 29 , 2026 | 04:09 AM

ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో బాలికలు, మహిళలపై ఇటీవల తరచూ వెలుగుచూస్తున్న అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.

నిర్భయ ఘటన తర్వాత వ్యవస్థ ఏం మారింది?
SUPREMECOURT

  • ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో అత్యాచారాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 28: ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో బాలికలు, మహిళలపై ఇటీవల తరచూ వెలుగుచూస్తున్న అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పోలీసు, పరిపాలనా యంత్రాంగాల వైఫల్యాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుమోటోగా(స్వచ్ఛందంగా) ఈ అంశాన్ని విచారణకు స్వీకరించింది. తక్షణమే పోలీసు బృందాలను నియమించి ప్రమాదాలు జరిగేందుకు వీలున్న ప్రాంతాలపై సర్వే నిర్వహించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. ఢిల్లీలోని స్వరూ్‌పనగర్‌లో ఓ బాలికపై సామూహిక అత్యాచారం, హత్య జరిగి.. ఆమె మృతదేహాన్ని కుళ్లిపోయిన స్థితిలో గుర్తించిన ఘటనను ప్రస్తావించింది. అలాగే, గ్రేటన్‌ నోయిడా నుంచి ఢిల్లీకి వెళుతున్న స్లీపర్‌ బస్సులో మైనర్‌ బాలికపై డ్రైవర్‌, కండక్టర్‌ లైంగిక దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. ఆ బస్సు 47 కిలోమీటర్లు ప్రయాణించేంత వరకూ పోలీసులు అడ్డుకోలేకపోవడం పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. దీనిని చూస్తుంటే 2012నాటి నిర్భయ ఘటన తర్వాత శాంతి భద్రతల అమలు యంత్రాంగంలో ఎలాంటి పురోగతి రాలేదన్న ప్రశ్నను లేవనెత్తుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిఘా, పెట్రోలింగ్‌ లేకపోవడం, నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్ల రహదారులు, పార్కులు, బస్సులు, మెట్రో స్టేషన్లు, సబ్‌వేలు, ఫుట్‌ బిడ్జిలు ప్రమాదకర ప్రాంతాలుగా మారుతున్నాయని హెచ్చరించింది.

ఈ వార్తలు కూడా చదవండి

రోడ్డు తనిఖీలో చెంపదెబ్బ వివాదం! ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మపై కేసు నమోదు

ఎల్‌పీయూలో భయానక రాత్రి.. ఆ రోజు ఏం జరిగింది..?

Updated Date - Sep 29 , 2026 | 04:09 AM