ఉన్నత విద్యా సంస్థలకు యూజీసీ తాజా నిబంధనపై విచారణకు సుప్రీంకోర్టు ఓకే
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:32 AM
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇటీవల ఉన్నత విద్యాసంస్థలకు జారీ చేసిన ఒక నిబంధనపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
న్యూఢిల్లీ, జనవరి 28: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇటీవల ఉన్నత విద్యాసంస్థలకు జారీ చేసిన ఒక నిబంధనపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్య బాగ్చిల బెంచ్‌ను అత్యవసరంగా ఈ పిటిషన్‌ను విచారించాలని ఒక న్యాయవాది కోరగా అందుకు అంగీకరించింది. మరోవైపు గతేడాది జూన్12న కూలిపోయిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై జరుపుతున్న అధికారిక విచారణ పౌరుల జీవించే హక్కు ను, వాస్తవ సమాచారాన్ని తెలుసుకొనే హక్కును ఉల్లంఘించిందని పేర్కొంటూ దాఖలైన పిల్ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది.